Nani: 'హిట్ 3'కి దుల్కర్ దన్ను!

ABN, Publish Date - Apr 17 , 2025 | 04:38 PM

గత యేడాది చివరిలో కిరణ్ అబ్బవరం 'క' చిత్రాన్ని మలయాళంలో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసింది. తాజాగా 1న రాబోతున్న నాని 'హిట్ -3'ని కూడా ఇదే సంస్థ విడుదల చేయబోతోందట.

నేచురల్ స్టార్ నాని (Nani) 'హిట్ -3' (Hit -3) చిత్రానికి హీరో మాత్రమే కాదు... నిర్మాణ భాగస్వామి కూడా. ఇప్పటికే 'హిట్, హిట్ -2' చిత్రాలను ఈ ఫ్రాంచైజ్ లో నిర్మించిన నాని ఇప్పుడు 'హిట్ -3'లో తానే హీరోగా నటించాడు. ప్రశాంతి తిపుర్నేనితో కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేశాడు. వీరిద్దరూ నిర్మించిన తాజా చిత్రం 'కోర్టు' (Court) కూడా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'హిట్-3' సక్సెస్ మీద కూడా నాని భారీ ఆశలే పెట్టుకున్నాడు. ముందు చిత్రాలకు లభించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని 'హిట్ -3'ని ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. కన్నడ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Setty) హీరోయిన్ గా నటించిన 'హిట్ -3'ని డా. శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 1న జనం ముందుకు వస్తోంది.


ఇదిలా ఉంటే... ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇవాళ తెలుగులోనూ పలు చిత్రాలలో నటిస్తూ చక్కని గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 'మహానటి (Mahanati), సీతారామం (Seetha Ramam), లక్కీ భాస్కర్ (Lucky Bhaskar)' చిత్రాలతో సూపర్ హిట్స్ ను తన కిట్ లో వేసుకున్నాడు. విశేషం ఏమంటే... దుల్కర్ సల్మాన్ కు మలయాళంలో సొంత నిర్మాణ సంస్థ ఉంది. వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మించడంతో పాటు పంపిణీ కూడా చేస్తుంటాడు దుల్కర్. గత యేడాది డిసెంబర్ లో వచ్చిన కిరణ్ అబ్బవరం 'క' (Ka) సినిమాను దుల్కన్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారానే కేరళలో రిలీజ్ చేశారు. ఇప్పుడు నాని 'హిట్ 3' మూవీ మలయాళ వర్షన్ ను కూడా దుల్కర్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా విడుదల కాబోతోంది. 'హిట్ -3' సినిమా ట్రైలర్ ను చూసిన వాళ్ళు గత యేడాది చివరిలో వచ్చిన 'మార్కో' మూవీలోని వయొలెన్స్ ను తలుచుకుంటున్నారు. ఇందులోనూ వయొలెన్స్ తక్కువేమీ ఉండదనే నిర్ణయానికి వచ్చేశారు. అదే నిజమైతే... 'మార్కో'ను సూపర్ హిట్ చేసిన మలయాళీలకు 'హిట్ 3' కూడా నచ్చే ఆస్కారం ఉంది. ఆ రకంగా 'హిట్ -3'... పంపిణీ దారుడిగా దుల్కర్ సల్మాన్ కు మంచి లాభాలే తెచ్చిపెడుతుంది.

Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ

Also Read: Nazriya Nazim Fahadh: ఫహద్ రియాక్షన్ ఏమిటో...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 17 , 2025 | 04:38 PM