Dhanush New Movie: అక్టోబర్‌లో అల్లుడు

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:41 AM

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అక్టోబర్ 1న విడుదలకానుంది. నిత్యామీనన్‌ కథానాయికగా, సత్యరాజ్‌, ప్రకాశ్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు

కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, నటనా ప్రాధాన్య పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ధనుష్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). నిత్యామీనన్‌ కథానాయిక. ఆకాశ్‌ భాస్కర్‌ నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, ప్రకాశ్‌రాజ్‌, షాలిని పాండే కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముందు ప్రకటించిన విధంగా ఈ చిత్రం ఈనెల 10న విడుదలవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు కొత్త తేదీకి మారింది. అక్టోబర్‌ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ధనుష్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. వేడుకల్లో స్టెప్పులేస్తున్న ధనుష్‌ లుక్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. ఈ చిత్రంలో గ్రామీణ యువకుడి పాత్రలో ధనుష్‌ కనిపించనున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 04:42 AM