కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం
ABN, Publish Date - Jan 08 , 2025 | 02:56 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈనెల 12న థియేటర్లలో...
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈనెల 12న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఈనెల 9న అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని అన్నారు. దర్శకుడు బాబి కొల్లి మాట్లాడుతూ ‘‘డాకు మహారాజ్’ చిత్రం రోబోయే చిత్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ ‘జనవరి 12 నా పుట్టిన రోజు. ఈ చిత్ర విజయాన్ని నా జన్మదిన కానుకగా అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది’ అని అన్నారు.