కోర్ట్ నన్ను గెలిపించింది
ABN, Publish Date - Mar 17 , 2025 | 02:37 AM
ప్రియదర్శి కథానాయకుడిగా రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం విజయవంతంగా...
ప్రియదర్శి కథానాయకుడిగా రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం విజయవంతంగా కొనసాగుతోన్న సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. నాని మాట్లాడుతూ ‘‘నేను ఎప్పుడూ స్ర్కిప్ట్, ప్రేక్షకుల అభిరుచినే నమ్ముతాను. ఈ సినిమా నన్ను, నా నమ్మకాన్ని గెలిపించింది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమా కథ విని చాలా గొప్ప అనుభూతిని పొందాను’’ అని ప్రియదర్శి చెప్పారు. ‘‘జీవితాలనే మార్చేయగల శక్తి సినిమా సొంతం. ఈ విజయం చిత్రబృందానికి అంకితం’’ అని రామ్ జగదీష్ అన్నారు.