New Telugu Movie: ఒక్కసారిగా మొదలైంది

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:51 AM

నూతన నటీనటులతో రూపొందించిన కామెడీ థ్రిల్లర్‌ 'చౌర్యపాఠం' ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వం వహించగా, ఇంద్రరామ్‌, పాయల్‌ రాధాకృష్ణ జంటగా నటిస్తున్నారు

నూతన నటీనటులతో సరికొత్త తరహాలో రూపొందుతున్న కామెడీ థ్రిల్లర్‌ ‘చౌర్యపాఠం’. దర్శకుడు నక్కిన త్రినాథరావు నిర్మిస్తున్నారు. నిఖిల్‌ గొల్లమారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇంద్రరామ్‌, పాయల్‌ రాధాకృష్ణ జంటగా నటిస్తున్నారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘ఒక్కసారిగా మొదలైంది కలవరం’ అంటూ సాగే గీతాన్ని శుక్రవారం వరుణ్‌తేజ్‌ చేతుల మీదుగా యూనిట్‌ విడుదల చేసింది. దావ్‌జాండ్‌ స్వరకల్పనలో అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. రాజీవ్‌ కనకాల, అలీ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని, ఎడిటర్‌: ఉత్తర

Updated Date - Apr 05 , 2025 | 04:51 AM