సెంటిమెంట్‌ తేదీన విశ్వంభర?

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:49 AM

చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు...

చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కొత్త తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. కానీ, చిరంజీవి బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో ఒకటైన ‘జగదేక వీరుడు - అతిలోక సుందరి’ విడుదలైన మే9న ‘విశ్వంభర’ను రిలీజ్‌ చేయనున్నారనే వార్తలు ఆ మధ్య వెలువడ్డాయి. తాజాగా జూలై 24న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్‌లో మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇంద్ర’ కూడా అదే రోజున విడుదలై ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. ఆ సెంటిమెంట్‌ ‘విశ్వంభర’కు కూడా పనిచేస్తుందని చిత్రబృందం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, ‘విశ్వంభర’ నుంచి ఈనెల 12న తొలి పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే ‘చిరంజీవి - అనిల్‌ రావిపూడి’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 09 , 2025 | 04:49 AM