మెగా గ్యాంగ్ పరిచయం
ABN, Publish Date - Apr 02 , 2025 | 05:13 AM
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (మెగా 157-వర్కింగ్ టైటిల్) ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే...
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (మెగా 157-వర్కింగ్ టైటిల్) ఉగాది నాడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లోని ఐకానిక్ పాత్రలనూ, చిత్రబృందాన్ని పరిచయం చేస్తూ వినూత్నమైన వీడియోను మంగళవారం అనిల్ రావిపూడి విడుదల చేశారు. వీడియో ప్రారంభంలో దర్శకత్వ విభాగం సభ్యులు చిరంజీవి పంచబోయే వినోదాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాస్టర్ పాటపాడుతూ ఎంట్రీ ఇవ్వగా, చిరంజీవి ‘గోదారి గట్టు’ పాట నుంచి కొన్ని లైన్లు ఆలపించి ఎంటర్‌టైన్ చేశారు.