మెగాస్టారుకో ముద్దు
ABN, Publish Date - Mar 19 , 2025 | 02:43 AM
తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను చూరగొన్నారు చిరంజీవి. ఒక్కసారి ఆయన్ను చూస్తే చాలు అనుకొనే అభిమానులకు కొదవలేదు. ఎన్నో ఏళ్లుగా తెరపైన చూస్తూ ఆరాధించిన మెగాస్టార్ కళ్లముందు ప్రత్యక్షమైతే...
తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానుల హృదయాలను చూరగొన్నారు చిరంజీవి. ఒక్కసారి ఆయన్ను చూస్తే చాలు అనుకొనే అభిమానులకు కొదవలేదు. ఎన్నో ఏళ్లుగా తెరపైన చూస్తూ ఆరాధించిన మెగాస్టార్ కళ్లముందు ప్రత్యక్షమైతే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ఇలాంటి ఓ అపురూపమైన దృశ్యానికి లండన్ ఎయిర్‌పోర్ట్ వేదికైంది. యూకే పార్లమెంట్‌లో సన్మానం కోసం చిరంజీవి లండన్ వెళ్లారు. ఆయనను చూడడానికి విమానాశ్రయానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిరంజీవిని చూడగానే భావోద్వేగానికి గురైన ఓ మహిళా అభిమాని ఆయన్ను దగ్గరకు తీసుకొని బుగ్గను ఆత్మీయంగా ముద్దాడారు. ‘మీ ఆనందమే నా ఆనందం’ అన్నట్లు ఆ క్షణాలను చిరంజీవి సైతం సంతోషంగా ఆస్వాదిస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. యూకే పార్లమెంట్ నేడు చిరంజీవిని సత్కరించనుంది. అలాగే బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందించనుంది.