మళ్లీ రాజకీయాల్లోకి రాను
ABN, Publish Date - Feb 12 , 2025 | 02:25 AM
‘‘పెద్దవాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లు కూడా దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడేమో అని చాలామంది అనుకుంటున్నారు...
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ప్రచారాన్ని ఖండించిన చిరంజీవి
నా రాజకీయ ఆశయాలను పవన్ కల్యాణ్ నెరవేరుస్తాడు
‘‘పెద్దవాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లు కూడా దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాడేమో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అలాంటిదేం లేదు. ఇక ముందు పొలిటికల్‌గా వెళ్లడమనేది లేదు. మీరు మరో ఆలోచన పెట్టుకోవద్దు’’ అని చిరంజీవి అన్నారు.
సినిమాకు సంగీతం ప్రధానాకర్షణ’ అని చెప్పారు. ప్రేమ, డబ్బు మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్న తీరును దర్శకుడు హృద్యంగా తెరకెక్కించారు అని రాజా గౌతమ్ చెప్పారు. వినోదం, సందేశం మేళవింపుగా ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు నిఖిల్ చెప్పారు. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు.
బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహి ంచిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి పునరాగమనం చెయ్యబోతున్నారంటూ తన గురించి జరుగుతున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు. ‘చాలామందికి చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎవరితో సన్నిహితంగా మెసిలినా సినీరంగానికి నా వంతు సేవలందించడానికే తప్ప దానివెనుక రాజకీయ ఆలోచన లేదు. పొలిటికల్‌గా ముందుకెళ్లడానికీ, నేననుకున్న లక్ష్యాలు, సేవలను కొనసాగించడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ, అభిమానులను అక్కున చేర్చుకొని ఆ కళామతల్లితోనే ఉంటాను’ అని స్పష్టం చేశారు. ‘బ్రహ్మానందంతో తన అనుబంధాన్ని వివరిస్తూ ‘బ్రహ్మానందం ఎవరో కాదు, నా సోల్‌మేట్. ఆయన్ను విపరీతంగా ప్రేమించిన సందర్భాలున్నాయి.
ఏడ్పించిన సందర్భాలున్నాయి. కోప్పడిన సందర్భాలున్నాయి. వయసులో చిన్నవాణ్ణే అయునా అవేవి ఆయన మనసులో పెట్టుకోలేదు. బ్రహ్మానందం సినిమాల్లోకి తన కొడుకులు రాజా, గౌతమ్‌ను కూడా తీసుకురావాలని రెండు మూడు సినిమాలు చేసినా అనుకున్న ఫలితమివ్వలేదు. అయినా మళ్లీ ఈ సినిమాతో ఓ ప్రయత్నం చేస్తున్నప్పుడు నావంతుగా సహకారం అందించాలనుకున్నాను. నేనే స్వయంగా ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి వస్తాను అని చెప్పాను. బ్రహ్మానందంతో నా స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలి. ఈ సినిమా బాగా ఆడుతుంది. బ్రహ్మానందానికి పుత్రోత్సాహం కలుగుతుంది. దర్శకుడు నిఖిల్ ఫ్రెష్‌థాట్‌తో ఈ సినిమా చేశాడు. ఈ సినిమాతో అందరికీ బ్రేక్ రావాలి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలి’ అని చిరంజీవి కోరారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ‘చిరంజీవిగారితో నాది నాలుగు దశాబ్దాల అనుబంధం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. మా దర్శకుడు నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకున్నారు. ఈ
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం
Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి
Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు
Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు
For Telangana News And Telugu News