Bollywood: హృతిక్ తో బాబీ సినిమా!
ABN, Publish Date - Apr 08 , 2025 | 04:41 PM
బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ తో బాబీ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు బీ టౌన్ లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ (Bollywood) స్టార్ట్స్ టాలీవుడ్ జపం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ మన డైరెక్టర్ల వెంట పడుతున్నారు. కథ చెప్పడానికి వెళ్తే చాలు.. ఎదురొచ్చి మరి స్వాగతం పలుకుతున్నారు. చూడబోతుంటే ఒక్కొక్కరుగా మన దర్శకులు బీటౌన్ పై తెలుగు జెండా ఎగరేసేలానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ అందరి దృష్టి సౌత్ డైరెక్టర్స్ మీద, మరీ ముఖ్యంగా తెలుగు ఫిల్మ్‌మేకర్స్ మీద పడింది. టాలీవుడ్ డైరెక్టర్స్ తీసిన సినిమాలు పాన్-ఇండియా లెవెల్‌లో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నాయి. తెలుగు హీరోలతో చేసిన సినిమాలే కాదు.. మన డైరెక్టర్లు అక్కడి వాళ్ళతో తీసినవి కూడా కలెక్షన్స్ కుమ్మేస్తున్నాయి. 'యానిమల్' (Animal) మూవీతో సందీప్ రెడ్డి వంగ (Sanadeep Reddy Vanga) లాంటి వాళ్ళు బాలీవుడ్‌లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసేసరికి ఈ క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో మరికొందరు డైరెక్టర్స్ కు గ్రాండ్ వెల్కమ్ దొరుకుతోంది.
త్వరలోనే టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తన ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'జాట్' (Jaat) తో ఆడియన్స్‌ని అలరించబోతున్నాడు. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol) ను చాలా స్ట్రాంగ్‌గా డీల్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే టైమ్‌లో మరో తెలుగు డైరెక్టర్ కూడా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడట. ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకు మహారాజ్’ లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాబీ (Bobby), అన్నీ కుదిరితే త్వరలోనే బాలీవుడ్‌లో స్టెప్ పెట్టబోతున్నాడు.
'డాకు మహారాజ్' తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న బాబీ, బాలీవుడ్ బిగ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) ని కలిశాడట. బాబీ చెప్పిన స్టోరీ లైన్ హృతిక్‌కి బాగా నచ్చేసిందని తెలుస్తోంది. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పేశాడని టాక్. ఫుల్ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు కానీ, హృతిక్ ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నది బాలీవుడ్ సమాచారం. త్వరలోనే బాబీ స్క్రిప్ట్‌ని పక్కాగా రెడీ చేసి, మరోసారి హృతిక్ కు ఫైనల్ వెర్షన్ వినిపిస్తాడట. హృతిక్ ఒకవేళ ఓకే అంటే ఆయన డేట్స్ చూసుకుని మూవీ సెట్స్ కు వెళ్ళడమే బాలెన్స్ ఉంటుందని అంటున్నారు. మాస్ సినిమాలకి పెట్టింది పేరైన బాబీ, హృతిక్‌తో చేసే మూవీ ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే ఆడియెన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read: Icon Star Allu Arjun: కొత్త అధ్యాయానికి నాంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి