ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:10 AM
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఇది నా ఒక్కడి కోరిక కాదు, తెలుగు ప్రజలందరి కోరిక అన్నారు...
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఇది నా ఒక్కడి కోరిక కాదు, తెలుగు ప్రజలందరి కోరిక అన్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన బాలకృష్ణను ఆయన నివాసంలో ఆదివారం కిషన్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు శాలువా కప్పి సత్కరించారు. పలు రంగాల్లో విశేషమైన సేవలందించిన బాలకృష్ణ గారికి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం సంతోషకరమన్నారు. అందుకే స్వయంగా కలిసి అభినందించి, శుభాకాంక్షలు తెలిపేందుకు బాలకృష్ణ గారికి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. బాలకృష్ణ అనేక ఏళ్లుగా హీరోగా, ప్రజాప్రతినిధినిగా తనదైన ముద్ర వేశారనీ, గత పదిహేను సంవత్సరాలుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా సేవలు అందిస్తు వేలాదిమందికి క్యాన్సర్ నుంచి విముక్తి కల్పించారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం, ఆయన నాకు గురువు కూడా’ అన్నారు. పద్మభూషణ్‌ను బిరుదుగా కన్నా బాధ్యతగా భావిస్తున్నాని, ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తానని, మంచి పనులు మరింత కొనసాగించేలా ఈ అవార్డు ప్రొత్సాహమిచ్చిందని అన్నారు. తన సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి)