నాగబంధం ఆధారంగా...
ABN, Publish Date - Jan 08 , 2025 | 02:52 AM
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘నాగబంధం’. జగపతిబాబు, జయప్రకాశ్, మురశీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు...
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా చిత్రం ‘నాగబంధం’. జగపతిబాబు, జయప్రకాశ్, మురశీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిశోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 13న ‘రుద్ర’ లుక్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని పురాతన ఆలయాల్ని రక్షించే నాగబంధం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: సంతోశ్ కామిరెడ్డి, డీఓపీ: సౌందర్ రాజన్, సంగీతం: అభే.