Boyapati Srinu: జార్జియాలో లొకేషన్ల అన్వేషణ

ABN, Publish Date - Apr 26 , 2025 | 03:06 AM

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రం సెప్టెంబర్‌ 25న దసరా సందర్భంగా విడుదల కానుంది.దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం జార్జియాలో లొకేషన్లను పరిశీలిస్తూ పుట్టినరోజు అక్కడే జరుపుకున్నారు

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎమ్‌.తేజస్విని నందమూరి సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ జార్జియాలో జరగనుంది. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం అక్కడ అందమైన లొకేషన్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలోనే బోయపాటి తన పుట్టినరోజును జార్జియాలో జరుపుకున్నారు. బాలకృష్ణ, ఇతర ప్రముఖ నటులు పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి థమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌ సి.రామ్‌ప్రసాద్‌, ఎడిటర్‌ తమ్మిరాజు.

Updated Date - Apr 26 , 2025 | 03:10 AM