James Cameron: చంద్రుడిపై అవతార్‌ యుద్ధం

ABN, Publish Date - Apr 05 , 2025 | 04:45 AM

అవతార్ హాలీవుడ్‌ చిత్రం సిరీస్‌కి మూడో భాగం ‘అవతార్: ది ఫైర్‌ అండ్‌ యాష్‌’ డిసెంబర్‌ 19న విడుదలకానుంది. ఈ చిత్రంలో జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో కథానాయకుడు జేక్‌ కుటుంబంతో కలిసి కొత్త ప్రతినాయకులతో పోరాడతారని చెప్పారు

ప్రపంచ సినీ ప్రేక్షకుల మెప్పు పొందిన హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌’. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు బాక్సాపీసు దగ్గర ఘన విజయం అందుకున్నాయి. త్వరలో మూడో భాగం ‘అవతార్‌: ది ఫైర్‌ అండ్‌ యాష్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుందని దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ‘అవతార్‌ 3’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. మూడో భాగంలో కథానాయకుడు జేక్‌, ఆయన కుటుంబం కొత్త ప్రతినాయకులతో పోరాడతారని చెప్పారు. గతంలో పండోరా గ్రహంపైన, సముద్రంలో వారు చేసిన పోరాటాలు ప్రేక్షకులను మెప్పించగా, ఈ సారి చంద్రుడిపై జరిగే యుద్ధాన్ని చూపించబోతున్నామన్నారు. ఈ సిరీ్‌సలోని గత చిత్రాలతో పోల్చితే మూడో భాగం ప్రేక్షకలను అమితంగా అలరిస్తుందని తెలిపారు. డిసెంబర్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Apr 05 , 2025 | 04:47 AM