'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే' వినోదాత్మకం

ABN, Publish Date - Feb 27 , 2025 | 01:27 PM

'దేశముదురు' హీరోయిన్ హన్సిక మోత్వానీ కథానాయికగా '105 మినిట్స్' అనే  సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేశారు దర్శకుడు రాజా దుస్సా

'దేశముదురు' హీరోయిన్ హన్సిక మోత్వానీ కథానాయికగా '105 మినిట్స్' అనే  సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేశారు దర్శకుడు రాజా దుస్సా(Raja Dussa). ఇప్పుడు తన తదుపరి చిత్రంగా తెలంగాణ యాస భాష నేపథ్యంలో 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే' (Atlas cycle athagaru petle) అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ లో గాలి కృష్ణ గారు నిర్మిస్తున్నారు.

1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక యదార్థ సంఘటనను తీసుకొని ఈ చిత్రాన్నిపూర్తి వినోదాత్మకంగా రూపొందిస్తున్నామని దర్శకుడు రాజా దుస్సా వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా వేణు మురళీధర్.వి, ఎక్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కార్తికేయ శ్రీనివాస్ (వాసు ) పని చేస్తున్నారు. నటినటులు, సాంకేతికవర్గాన్ని త్వరలోనే తెలియజేస్తామని చిత్రం యూనిట్ తెలిపింది. తాజాగా ఈ చిత్రం పోస్టర్ ను నిర్మాత అనిల్ సుంకర లాంచ్ చేసారు. 

Updated Date - Feb 27 , 2025 | 01:27 PM