Actress Vijayashanti: మంచి సినిమా చేశాననే తృప్తినిచ్చింది

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:02 AM

విజయశాంతి ముఖ్యపాత్రలో నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమా విజయం సాధించింది. ఈ చిత్రం ద్వారా తాను శక్తివంతమైన పాత్రలో నటించాననే తృప్తి పొందినట్టు ఆమె తెలిపారు

- విజయశాంతి

‘ఓ మంచి సినిమా చేశాననే తృప్తిని ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ఇచ్చింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు సీనియర్‌ నటి విజయశాంతి. కల్యాణ్‌రామ్‌, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై సక్సె్‌సఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ ‘చాలా విరామం తర్వాత ఒక శక్తిమంతమైన పాత్రలో నటించాను. ప్రేక్షకులు విజయశాంతిని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది నెరవేరింది. ఇప్పుడు యాక్షన్‌ అనేది ఒక రకంగా నాకు ఛాలెంజ్‌. అయినా చేశాను. పోలీస్‌ పాత్రలకు నేనైతేనే బాగుంటుందని ప్రేక్షకులు కూడా బలంగా ఫిక్స్‌ అయిపోయారు. తల్లీకొడుకుల బంధాన్ని, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ సినిమాలో బలంగా చూపించాం. చాలా మంది మహిళలు ఫోన్‌ చేసి సినిమా అద్భుతంగా ఉంది అని అంటున్నారు’ అని చెప్పారు.

Updated Date - Apr 23 , 2025 | 12:02 AM