కదన రంగంలోకి

ABN, Publish Date - Apr 07 , 2025 | 05:33 AM

నటుడు అర్జున్‌ సర్జా కీలకపాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీతాపయనం’. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై...

నటుడు అర్జున్‌ సర్జా కీలకపాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీతాపయనం’. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రూపొందుతోంది. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్న హీరో ధ్రువ సర్జా ఫస్ట్‌లుక్‌ను శ్రీరామనవమి సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. తీక్షణమైన చూపులతో కదన రంగంలోకి దిగుతున్నట్టు ఆయన కనిపించారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా అర్జున్‌ కథానాయిక. నిరంజన్‌, సత్యరాజ్‌, ప్రకాశ్‌రాజ్‌, కోవై సరళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: అనుప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: జి. బాలమురుగన్‌, ఎడిటర్‌: ఆయూబ్‌ఖాన్‌

Updated Date - Apr 07 , 2025 | 05:33 AM