అనన్య హిందీ చిత్రం

ABN, Publish Date - Apr 07 , 2025 | 05:43 AM

సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటిని కొత్తతరహాలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్‌ కథానాయిక అనన్య నాగళ్ల. ‘మల్లేశం, వకీల్‌సాబ్‌’ తదితర...

సవాల్‌తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటిని కొత్తతరహాలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్‌ కథానాయిక అనన్య నాగళ్ల. ‘మల్లేశం, వకీల్‌సాబ్‌’ తదితర చిత్రాల్లో పాత్రోచిత నటనతో ఆమె ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు బాలీవుడ్‌ అరంగేట్రానికి సిద్ధమయ్యారు అనన్య. మహిళా ప్రాధాన్య కథతో రూపొందుతోన్న హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఏక్తా ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి రాకేశ్‌ జగ్గి దర్శకత్వం వహిస్తున్నారు. హిమ్మత్‌ లడుమోర్‌ నిర్మిస్తున్నారు. ‘ఇప్పటికే యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. వాణిజ్య అంశాలకి, సామాజిక అంశాలను కలిపి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఓ గిరిజన యువతి పాత్రలో అనన్య నాగళ్ల కనిపించనున్నారు. ఆమె అభినయం చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Apr 07 , 2025 | 05:43 AM