Ajith Kumar New Film: పెద్ద విజయం అందుకోబోతున్నాం

ABN, Publish Date - Apr 13 , 2025 | 11:51 PM

తెలుగు రాష్ట్రాల్లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. అజిత్ కుమార్ నటనతో ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోందని చిత్రబృందం తెలిపింది

Ajith Kumar New Film: పెద్ద విజయం అందుకోబోతున్నాం

‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో చక్కని ఆదరణ దక్కుతోంది. అన్ని చోట్లా సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇది ఇక్కడితో ఆగదు. సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతోంది’ అని నిర్మాత నవీన్‌ యెర్నేని అన్నారు. అజిత్‌కుమార్‌ హీరోగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ఆదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం సక్సె్‌సమీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా అధిక్‌ రవిచంద్రన్‌ మాట్లాడుతూ ‘మైత్రీ సంస్థ తమిళంలో చేసిన తొలి చిత్రమిది. నవీన్‌ గారి వల్లే సినిమా ఇంత పెద్దహిట్‌ అయింది. అజిత్‌ గారి మద్దతు మరువలేనిది’ అని చెప్పారు. అజిత్‌ఫ్యాన్స్‌ ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారని సునీల్‌ చెప్పారు. ఈ సినిమాలో నా పాత్రకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కడం ఆనందాన్నిచ్చింది అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 11:52 PM