Agraharmlo Ambedkar First Look: అంబేద్కర్‌కు నివాళిగా

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:30 AM

అంబేద్కర్‌ ఆలోచనలకు నివాళిగా మంధా కృష్ణ చైతన్య స్వీయ దర్శకత్వంలో 'అగ్రహారంలో అంబేద్కర్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ఆవిష్కరించారు

మంధా కృష్ణ చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అగ్రహారంలో అంబేద్కర్‌’. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ ‘అంబేద్కర్‌ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం’ అని అన్నారు. అంబేద్కర్‌కు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’ అని కృష్ణచైతన్య అన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 12:30 AM