అట్లీ దర్శకత్వంలో ‘పుష్పరాజ్’
ABN, Publish Date - Apr 09 , 2025 | 04:50 AM
తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమా ఖరారు అయుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం...
తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమా ఖరారు అయుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘ల్యాండ్‌మార్క్ సినిమాటిక్ ఈవెంట్ ‘‘ఏఏ22-ఏ6’’ కోసం సిద్ధమవ్వండి. సన్ పిక్చర్స్ నుంచి ఒక గొప్ప ప్రయత్నం’ అని ట్వీట్ చేస్తూ ఓ వీడియోను నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా వీడియోలో చూపించారు. అలాగే, అల్లు అర్జున్‌కు స్ర్కీన్ టెస్ట్ చేసిన విజువల్స్‌నూ ఇందులో చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ కథకు భారీగా వీఎ్‌ఫఎక్స్ సన్నివేశాల అవసరం ఉండడంతో అల్లు అర్జున్, అట్లీ ఇద్దరూ అమెరికా వెళ్లారు. వివిధ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలను సందర్శించి నిపుణులతో చర్చించారు. రూ. 250 కోట్లు వీఎ్‌ఫఎక్స్ కోసమే సన్ పిక్చర్స్ ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రోస్థటిక్ మేక్‌పలో అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది.
చెన్నై, (ఆంధ్రజ్యోతి)