Allari Naresh: ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’ టీమ్‌కు అల్లరోడి అభినందనలు
ABN, Publish Date - Feb 05 , 2025 | 08:36 PM
ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగ్‌గా ప్రేక్షకులకు త్వరలో చూపించబోతున్నటువంటి ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’ టీమ్‌కు అభినందనలు అని తెలిపారు కామెడీ కింగ్ అల్లరి నరేష్. తాజాగా ఆయన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశారని, అవి తనకు ఎంతో నచ్చడంతో టీమ్‌ని అభినందిస్తూ.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరారని చిత్ర టీమ్ తెలిపింది.
మహేంద్ర గజేంద్ర సమర్పణలో.. గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘W/O అనిర్వేష్’. వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తోన్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్.. చిత్రయూనిట్‌ను ముఖ్యంగా దర్శకుడు గంగ సప్తశిఖరను అభినందించారు.
Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..
ఈ విషయం చెబుతూ మేకర్స్ అల్లరి నరేష్ టీమ్‌ను అభినందిస్తున్న ఫొటోను విడుదల చేశారు. ఈ ఫొటోలో అల్లరి నరేష్ నవ్వుతూ కనిపిస్తున్నారు. ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’ సినిమా గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ.. కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో అలరించబోతున్న ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించింది సీనియర్ రైటర్ బాబీ కెఎస్‌ఆర్ అని తెలిసింది. ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగ్‌గా ప్రేక్షకులకు త్వరలో చూపించబోతున్నటువంటి ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. టీమ్ అందరికీ అభినందనలు అని చెప్పుకొచ్చారు.
చిత్ర టీమ్‌ని అభినందించిన అల్లరి నరేష్‌కు దర్శకుడు ధన్యవాదాలు తెలిపారు. సంగీత దర్శకుడు షణ్ముఖ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసిందని, అలాగే విఆర్‌కె నాయుడు కెమెరామెన్‌గా తన ప్రతిభను చూపించారని కొనియాడారు చిత్ర దర్శకుడు గంగ సప్తశిఖర. ఈ చిత్రాన్ని ఎస్‌కెఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లుగా ఆయన తెలిపారు.