అఖిల్‌... లెనిన్‌

ABN, Publish Date - Apr 09 , 2025 | 04:46 AM

పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా, పేరు ఉండదు... పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుందిరా’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌, లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు అఖిల్‌ అక్కినేని....

పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుందిరా, పేరు ఉండదు... పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుందిరా’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌, లుక్‌తో ఎంట్రీ ఇచ్చారు అఖిల్‌ అక్కినేని. ఆయన కథానాయకుడిగా నటించబోయే కొత్త చిత్రానికి ‘లెనిన్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. మంగళవారం అఖిల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించి, గ్లింప్స్‌ను విడుదల చేసింది. అందులో గుబురు మీసం, పొడవాటి జుట్టుతో మాస్‌లుక్‌లో అఖిల్‌ ఆకట్టుకున్నారు. రాయలసీమ నేపథ్యంలో పోరాట ఘట్టాలు, పతాకస్థాయి భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందుతోందని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకుడు. సంగీతం: తమన్‌, సినిమాటోగ్రఫీ: నవీన్‌కుమార్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి.

Updated Date - Apr 09 , 2025 | 04:46 AM