Akash Puri: కర్మ స్థలం లాంటి కథలో నటించాలని ఉంది

ABN, Publish Date - Mar 08 , 2025 | 11:53 PM

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’.  అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు.

రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ (Rocky) తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’ (Karma Stalam) అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు.  శుక్రవారం ఈ సినిమా  మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు.  
ఆకాష్ పూరి మాట్లాడుతూ "కర్మస్థలం" టైటిల్ బాగుంది. మోషన్ పోస్టర్ కూడా బాగుంది.  నేను కూడా అమ్మవారి భక్తుడినే .ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు ఉంది అని అన్నారు.  

ప్రొడ్యూసర్ యువరాజ్ మాట్లాడుతూ "8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది. సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది.రాకీ చాలా హార్డ్ వర్కింగ్. ఈ సినిమా కోసం తన 100% ఇచ్చాడు అని అన్నారు. 

డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ "మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి. ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని" అని అన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:53 PM