వినోదం పంచుతుంది
ABN, Publish Date - Apr 19 , 2025 | 03:26 AM
ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకుడు....
ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకుడు. ఆమిర్‌ఖాన్ సరసన జెనీలియా నటిస్తున్నారు. మే 1న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు యూనిట్ శుక్రవారం ప్రకటించింది. ‘‘తారే జమీన్ పర్’ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. మనవైన జీవితాల్ని, పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన చిత్రమది. కానీ ‘సితారే జమీన్ పర్’ వినోదాత్మకంగా, ఉల్లాసంగా నడుస్తుంది. అందరినీ నవ్విస్తుంది’ అని ఆమిర్‌ఖాన్ ఈ సందర్భంగా తెలిపారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.