త్రీడీ వెర్షన్‌లో

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:48 AM

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో...

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలైంది. ఈ బ్లాక్‌బస్టర్‌ విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. త్రీడీ వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:48 AM