ఆగస్టులోనే రెండో యుద్ధం

ABN, Publish Date - Mar 17 , 2025 | 02:40 AM

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘వార్‌-2’. ఆర్యన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కిస్తోంది. కాగా...

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘వార్‌-2’. ఆర్యన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ తెరకెక్కిస్తోంది. కాగా, ఈ సినిమాను ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్‌లో హృతిక్‌ కాలికి గాయం అవడం వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల మరింత జాప్యం జరిగి విడుదల వాయిదా పడుతుందంటూ బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని చిత్రబృందం ఖండించింది. హృతిక్‌ కోలుకోగానే మిగిలిన భాగాన్ని పూర్తి చేసి, ముందు ప్రకటించిన విధంగానే ఆగస్టు 14న ‘వార్‌ 2’ను విడుదల చేస్తామని యూనిట్‌ పేర్కొంది.

Updated Date - Mar 17 , 2025 | 02:40 AM