అభిమానులపై దురుద్దేశం లేదు.. కావాలనే అలా చేస్తున్నారు
ABN, Publish Date - Feb 01 , 2025 | 03:59 PM
సింగర్ ఉదిత్ నారాయణ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన గాయకుడాయన. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు.
సింగర్ ఉదిత్ నారాయణ్ (udit Narayan) గురించి పరిచయం అక్కర్లేదు. ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో ఎన్నో విజయవంతమైన పాటలు పాడిన గాయకుడాయన (Singer Udit Narayana) . తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఆయన లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. తన కెరీర్‌లోనే పేరు పొందిన పాటలను ఆలపించారు. ‘మోహ్ర’లోని టిప్ టిప్ బర్‌సా పాట పాడుతున్న సమయంలో కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటో తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఒక మహిళా అభిమాని పెదవులపై ముద్దు పెట్టుకోవడం అంతటా వైరల్ అయింది. ఆయన తీరును తప్పుబడుతూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోముద్దు వివాదంపై నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోవివరణ ఇచ్చారు. (Udit Narayan Kiss Controversy)
‘‘అభిమానులు నా పాటను ఎంత ఇష్టపడతారో అంతకుమించి నన్ను ఇష్టపడతారు. తమ ఇష్టాన్ని తెలియజేయడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా కొంతమంది షేక్‌హ్యాండ్ ఇవ్వాలనుకుంటారు. మరికొంతమంది ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అది కేవలం ఆత్మీయతతో కూడుకున్న విషయమే తప్ప వేరే ఏం కాదు. నేను మర్యాద తెలిసిన వ్యక్తినే. వారితో తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం నాకు లేదు. మాకు సమాజంలో మంచి పేరు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటాం. ఇటీవల వేదికపై జరిగింది అభిమానులపై ఉన్న ప్రేమను తెలియజేస్తూ అలా చేశారు. అందులో మరో ఉద్దేశం లేదు. కొంతమంది కావాలనే దీనిని వివాదంగా చూస్తున్నారు’’ అని ఉదిత్ అన్నారు. ‘కీరవాణి రాగంలో’, ‘పసిఫిక్‌లో దూకేయ్‌మంటే’, ‘అమ్మాయే సన్నగా’.. ‘అందమైన ప్రేమరాణి’, ‘అందాల ఆడబొమ్మ’ వంటి ఎన్నో హిట్ పాటలను పాడి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఉదిత్ నారాయణ్.