Tamannaah-Vijay varma: విడిపోవాలనుకోవడానికి కారణం ఏంటి.. కెరీర్ అడ్డం పడుతోందా..
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:00 PM
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah-Vijay varma), నటుడు విజయ్ వర్మ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. పలు ప్రైవేట్ పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి గురించి ఒకరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు కూడా
మిల్కీబ్యూటీ తమన్నా(Tamannaah-Vijay varma), నటుడు విజయ్ వర్మ ఎంతోకాలంగా ప్రేమలో ఉన్నారు. పలు ప్రైవేట్ పార్టీల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి గురించి ఒకరు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు కూడా. అయితే ఉన్నట్టుండి వీరిద్దరికీ బ్రేకప్ జరిగిందని నేషనల్ మీడియా కథనాలు రాసింది. రెండేళ్ల ప్రేమకు ఫుల్‌స్ట్టాప్ పెట్టేసి.. ఇకపై స్నేహితులుగానే కొనసాగాలనుకుంటున్నారని ఆయా మాధ్యమాల్లో వార్తలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు తమన్నా - విజయ్ వర్మ తమ రిలేషన్‌ను కొనసాగించపోవడానికి కారణం ఏంటా అని అందరూ చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని వార్తలు తెరపైకి వచ్చాయి.
కెరీర్, పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా.. పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలని నిర్ణయించుకున్నారని.. విజయ్ వర్మ మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలిసింది. విజయ్ ప్రస్తుతానికి కెరీర్ పైనే దృష్టి పెట్టాలనుకున్నారని ఈ క్రమంలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అందుకే విడిపోయారని టాక్ నడుస్తోంది. (Tamannaah-Vijay varma Breakup)
తమన్నా, విజయ్ వర్మ 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి పని చేశారు ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో ఈ జంట బయటపెట్టింది. ‘‘నాకోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్‌వర్మ ఆ ప్రపంచంలోకి వచ్చాడు. తను నన్నెంతో అర్థం చేసుకున్నాడు. అన్ని విషయాల్లో గౌరవం ఇస్తాడు’’ అంటూ విజయ్ వర్మ గురించి చెప్పింది మిల్కీబ్యూటీ. అయిఏత బ్రేకప్ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. ప్రస్తుతం తమన్నా ఓదెల-2 చిత్రంలో నటిస్తున్నారు.