Sreeleela : షాహిద్ తో కిసిక్ బ్యూటీ
ABN, Publish Date - Apr 22 , 2025 | 06:18 PM
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌కు షిఫ్ట్ అవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్యూటీ వరుసగాక్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) రఫ్పాడిస్తోంది. సౌత్ నార్త్ అని తేడా లేకుండా దూకుడు పెంచింది. పుష్ప2 (Pushpa 2) లో కిస్సిక్ సాంగ్ తో తెగ పాపులర్ కావడంతో విజ్జి పాప పేరు పాన్ ఇండియా రేంజ్ లో మార్మోగిపోయింది. ప్రెజెంట్ టీటౌన్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ... బాలీవుడ్ లో గోల్డెన్ ఛాన్స్ లు కొట్టేస్తోంది.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) తో ఓ లవ్ స్టోరీలో నటిస్తోంది శ్రీలీల. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ లో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమా కంప్లీట్ కాక ముందే మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. ఏకంగా రాజ్ అండ్ డీకే (Raj & DK)వరల్డ్ లోకి అడుగుపెట్టనున్నట్లు బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే సమంతతో 'ఫ్యామిలీమ్యాన్ 2' (The Family Man2) , 'సిటాడెల్: హనీబన్నీ' (Citadel Honey Bunny)పేరుతో వెబ్ సీరిస్ ను తెరకెక్కించారు. ఇప్పుడు కొత్తగా శ్రీలీలతో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటి వరకు సినిమాలతోనే మాయ చేసిన బ్యూటీ ఫస్ట్ టైం వెబ్ సిరీస్ లోకి అడుగుపెడుతూండటం హాట్ టాపిక్ గా మారింది.
షాహిద్ కపూర్(Shahid Kapoor) , రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన 'ఫర్జీ' (Farzi) వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , రాశీఖన్నా (Raashii Khanna) లీడ్ రోల్స్ లో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియులను అలరించింది. దొంగనోట్లను ముద్రించే వ్యక్తిగా షాహిద్ జీవించేశాడు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా `ఫర్జీ 2' వచ్చేస్తోంది. ప్రెజెంట్ స్క్రిప్ట్ వరకు జరుగుతోంది. డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సిరీస్ లో షాహిద్ కు జోడిగా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నారట. ఆల్ మోస్ట్ బ్యూటీ ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తోంది. రీసెంట్ గా జరిగిన స్క్రీనింగ్ టెస్ట్ లో పర్ఫెక్ట్ గా సూట్ అయిందని... అందుకే బ్యూటీకే ఓటేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరీ బీటౌన్ లో శ్రీలీల జోరు ఉండబోతుందో చూడాలి.