Don 3: కియారా అవుట్... శార్వరీ ఇన్...

ABN, Publish Date - Apr 16 , 2025 | 04:11 PM

బాలీవుడ్ బ్యూటీ శార్వరీ జాక్ పాట్ కొట్టేసింది. క్రేజీ ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ లో నటించే ఛాన్స్ దక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీల్లో డాన్ సీరీస్ ఒకటి. అందులో భాగంగా రాబోయే 'డాన్3' (Don3) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో రణవీర్ సింగ్ (Ranveer Singh) టైటిల్ రోల్‌ లో కనిపించనుండగా, హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ కియారా అద్వానీ (Kiara Advani ) ఫైనల్ అయింది.‌ అయితే ఉన్నట్టుండి ఈ బ్యూటీ ఇప్పుడు ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈ న్యూస్ ఫ్యాన్స్‌ని షాక్‌లో ముంచెత్తినా, టీమ్ వెంటనే కొత్త హీరోయిన్ కోసం సెర్చ్ చేసి, ఫైనల్‌గా యంగ్ సెన్సేషన్ శార్వరీ (Sharvari ) ని లాక్ చేసింది. ఈ రీప్లేస్‌మెంట్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌ అయింది. కైరా ఎందుకు తప్పుకుందని ఒకటే పనిగా ఆరా తీస్తున్నారు.


'డాన్ 3' డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ (Farhan Akhtar) సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలని భావిస్తున్నాడు. దీంతో సినిమా షూటింగ్ షెడ్యూల్ ఏడాది పాటు వాయిదా పడింది. అదే సమయంలో, కియారా అద్వానీ తల్లి కాబోతుండటంతో సినిమాల నుంచి తాత్కాలిక బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా, 'డాన్ 3' లాంటి భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అందుకే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి శార్వరీని ఎంపిక చేశారు.

శార్వరీ... ఇప్పుడు బాలీవుడ్‌లో సర్కిల్స్ లో హాట్ ఫేవరెట్. గత ఏడాది ముంజా (Munjya) అనే హారర్-కామెడీ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ దక్కించుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్, తన టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ, బిజీ బిజీగా మారింది. 'మహారాజ్' (Maharaj ) , 'వేదా' (Vedaa) వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శార్వరీ, ఇటీవల ఆలియా భట్ (Alia Bhatt) , బాబీ డియోల్ (Bobby Deol) లీడ్ రోల్స్‌లో నటించిన 'ఆల్ఫా' (Alpha) సినిమా షూటింగ్‌ని కూడా కంప్లీట్ చేసింది. ఇప్పుడు, 'డాన్ 3' లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో రణవీర్ సింగ్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం బ్యూటీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్రేక్ అని అంటున్నారు క్రిటిక్స్. చూడాలి ఈ సినిమా తర్వాత శార్వారీ మెయిన్ లీగ్ లో అడుగుపెడుతుందేమో...!

Updated Date - Apr 16 , 2025 | 04:11 PM