Yash Raj Films: ఇంటెన్స్ లవ్ స్టోరీగా సయారా

ABN, Publish Date - Apr 22 , 2025 | 04:28 PM

చుంకీ పాండే తమ్ముడు చిక్కీ పాండే కొడుకు అహాన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతనితో యశ్ రాజ్ ఫిలిమ్స్ 'సయారా' అనే సినిమా నిర్మిస్తోంది.

అహాన్ పాండే (Ahaan Panday), అనీత్ పద్దా (Aneet Padda) జంటగా యష్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) నిర్మాణంలో మోహిత్ సూరి (Mohit Suri) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సయారా’ (Saiyaara). తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాను జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఆదిత్య చోప్రా (Aditya Chopra) సమర్పణలో అక్షయ్ విద్హానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


‘సయారా’ చిత్రాన్ని ఓ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు మోహిత్ సూరి. ఈ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలోకి చుంకీ పాండే తమ్ముడు చిక్కీ పాండే కొడుకు అహాన్ అడుగు పెడుతున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌ గ్రాండ్ వేలో వరల్డ్ వైడ్ రిలీజ్ కు యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తోంది.

Also Read: Vijay: రీ-రిలీజ్ లో సచిన్ నయా రికార్డ్...

Also Read: AISF: అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 22 , 2025 | 04:28 PM