Rakhi Sawant Marriage: మూడో పెళ్లికి ఫైర్ బ్రాండ్ రెడీ.. టార్గెట్ పాకిస్తాన్!
ABN, Publish Date - Jan 29 , 2025 | 02:48 PM
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మూడో పెళ్లికి రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, విడాకులు తీసుకున్న రాఖీ సావంత్ మూడో పెళ్లితోనూ సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. కొన్ని రోజులుగా ఒక పర్సన్‌తో ప్రేమలో ఉన్నానని చెబుతూ వస్తున్నా రాఖీ సావంత్.. ఆ పర్సన్ వివరాలను రివీల్ చేస్తూ.. త్వరలోనే పెళ్లి అని క్లారిటీ ఇచ్చేసింది. అసలు విషయం ఏమిటంటే..
ఎప్పుడూ వివాదాలతో వార్తలలో ఉండే ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ మూడో పెళ్లికి రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న ఈ భామ.. కొన్ని రోజులుగా తనొకరితో ప్రేమలో ఉన్నట్లుగా చెబుతూ వస్తుంది. అతను కూడా తనని ప్రేమిస్తున్నాడని.. త్వరలోనే అతడిని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా హింట్స్ వదులుతూ ఉంది. తాజాగా బాలీవుడ్ మీడియాతో అతడితో పెళ్లిని ధృవీకరించడమే కాకుండా.. ప్రియుడి వివరాలను కూడా వెల్లడించింది. ఆమె చెబుతున్న వివరాల్లోకి వెళితే..
Also Read- Jhansi vs Jani: నటి ఝాన్సీ ఒకలా.. కొరియోగ్రాఫర్ జానీ మరోలా.. మళ్లీ మొదలైంది
పాకిస్తానీ నటుడు, పోలీసు అధికారి అయిన డోడి ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్లుగా చెప్పిన రాఖీ సావంత్.. త్వరలోనే అతనిని వివాహం చేసుకోనున్నానని తెలిపింది. ‘అతడే నా ప్రేమికుడు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము. అతడిది పాకిస్తాన్. నాది భారతదేశం. మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకోబోతున్నాం..’’ అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాతో పేర్కొంది. ఇదే సమయంలో తన మాజీ భర్తపై ఆమె సంచలన కామెంట్స్ చేసింది.
Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
నా మాజీ భర్త ఆదిల్ ఖాన్ నాపై లేనిపోని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకుంటున్నాననే అసూయతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ ఇడియట్‌కు ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వడం నాకు ఇష్టం లేదని తెలిపింది. ఆదిల్ ఖాన్‌ని గతంలో రాఖీ సావంత్ రెండో వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం.. అతనికి వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడంతో.. ఇద్దరి మధ్య తారాస్థాయికి గొడవలు చేరాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ 2023లో విడిపోయారు. అదే టైమ్‌లో ఆదిల్‌ని పోలీసులు అరెస్ట్ కూడా కూడా చేశారు. 5 నెలల జైలు శిక్ష అనంతరం ఆదిల్ విడుదలయ్యాడు.
ఆదిల్ కంటే ముందు రితేష్ సింగ్ అనే అతన్ని రాఖీ సావంత్ వివాహం చేసుకుంది. వీరిద్దరూ బిగ్ బాస్ 15లో కూడా పాల్గొన్నారు. 2022లో షో ముగిసిన అనంతరం వీరిద్దరూ విడిపోయారు. అదే సంవత్సరం ఆదిల్ ఖాన్‌ని రాఖీ వివాహం చేసుకుంది. సినిమాల విషయానికి వస్తే.. రాఖీ సావంత్ ‘ముంబై ఎక్స్‌ప్రెస్, దిల్ బోలే హడిప్పా, మేరే బ్రదర్‌కి దుల్హన్, బుద్ద మార్ గయా’ వంటి సినిమాలలో నటించిన ఈ భామ కొన్ని డ్యాన్స్ నంబర్స్‌లోనూ తన టాలెంట్ చూపించింది. అలాగే టెలివిజన్ షోలలో కూడా ఆమె పేరు మారుమోగింది.