Prithviraj: కొత్త సంవత్సరం కొత్త ముచ్చట...
ABN, Publish Date - Apr 14 , 2025 | 04:25 PM
ప్రముఖ దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ కొత్త సినిమా వివరాలను తెలియచేశాడు. హిందీలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. అతని సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) మలయాళీల కొత్త సంవత్సరం రోజున ఓ కొత్త కబురును అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటికే నాలుగైదు హిందీ సినిమాలలో నటించిన పృథ్వీరాజ్ తాజాగా ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం చేయబోతున్నాడు. దానికి సంబంధించిన రెండు ఫోటోలతో పాటు ఆ మూవీ విశేషాలను పృథ్వీరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బేసికల్ గా మలయాళీ అయిన పృథ్వీరాజ్... ఇతర భాషా చిత్రాలలోనూ నటించాడు. కొన్ని సినిమాలను నిర్మించి, మరికొన్ని సినిమాలను పంపిణీ చేశాడు. అలానే 'లూసిఫర్' మూవీతో దర్శకుడిగా మారి, ఆ తర్వాత 'బ్రో డాడీ' మూవీనీ డైరెక్ట్ చేశాడు. ఇక ఇటీవల 'లూసిఫర్'కు సీక్వెల్ గా పృధ్వీరాజ్ తెరకెక్కించిన 'ఎల్ 2: ఎంపురాన్' (L2: Empuraan) మూవీ విడుదల కావడమే వివాదాలకు తెరలేపింది. ఈ సినిమా విడుదలైన తర్వాత కథానాయకుడు మోహన్ లాల్ ప్రేక్షకులకు సంజాయిషీ ఇచ్చుకున్నారు. కానీ పృథ్వీరాజ్ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటించాడు. అయితే... ఇన్ని రోజుల తర్వాత అదీ సోషల్ మీడియా వేదికగా తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను తెలియచేశాడు. అయితే 'ఎంపురాన్'పై వచ్చిన విమర్శలపై పృథ్వీరాజ్ పెదవి విప్పకపోయినా... అతని తరఫున అతని తల్లి ఘాటైన విమర్శలు చేసింది. తన కొడుకును బలి పశువును చేస్తున్నారని వాపోయింది.
Also Read: Tollywood: యువ కథానాయకులకేమైంది...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి