Abir Gulaal: వాణీ కపూర్ సినిమాకు కష్టాలు.. ఇండియాలో విడుదల లేనట్టే
ABN, Publish Date - Apr 24 , 2025 | 03:15 PM
‘అబీర్ గులాల్’ హీరో ఫవాద్ ఖాన్ పాకిస్థాన్ నటుడి సినిమా కావడంతో.. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే నిషేదించాలని నెట్టింట నెగటివ్ ప్రచారం మొదలైంది.
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) హీరోగా నటించిన హిందీ సినిమా ‘అబీర్ గులాల్’ (Abir Gulal). ఇందులో వాణీ కపూర్ (Vaani Kapoor) హీరోయిన్. పాకిస్థాన్ నటుడి సినిమా కావడంతో.. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే నిషేదించాలని నెట్టింట నెగటివ్ ప్రచారం మొదలైంది.
ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించినట్టు నేషనల్ మీడియా పేర్కొంది. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని భారతదేశంలో విడుదలకు అనుమతించమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ చిత్రానికి ఆర్తి ఎస్ బగ్ డి దర్శకురాలు.