Mahira sharma: క్రికెటర్‌తో లింకప్‌... స్పందించిన నటి

ABN, Publish Date - Mar 04 , 2025 | 06:10 PM

భారత క్రికెటర్‌, హైదరాబాదీ ప్లేయర్‌ మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj) ప్రేమ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్‌ మహిరా శర్మతో (Mahira Sharma)సిరాజ్‌ డేటింగ్‌లో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి.

భారత క్రికెటర్‌, హైదరాబాదీ ప్లేయర్‌ మహ్మద్‌ సిరాజ్‌(Mohammed Siraj) ప్రేమ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. హిందీ బిగ్‌బాస్‌ ఫేమ్‌ మహిరా శర్మతో (Mahira Sharma)సిరాజ్‌ డేటింగ్‌లో ఉన్నాడంటూ కథనాలు వస్తున్నాయి. అతని సన్నిహితులే ఈ విషయాన్ని వెల్లడించారిన పలు నేషనల్‌ వెబ్‌సైట్స్‌లో వార్తలొచ్చాయి.. మహిరా చేసిన పోస్టుకు ఇన్‌స్ట్టాగ్రామ్‌లో సిరాజ్‌ లైక్‌ కొట్టడంతోపాటు ఫాలో కావడం ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది’’ అని ఆయా మాధ్యమాలు పేర్కొన్నాయి. (dating rumours with cricketer)

ఈ గుసగుసలపై  తాజాగా మహిరా శర్మ ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. ‘ఇందులో చెప్పడానికి ఏమీ లేదు.. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. అభిమానులు మనకు ఎవరితో అయినా సంబంధాలను పెట్టగలరు. నేను పనిచేసిన సహ నటులతో కూడా సంబంధం అంటగట్టారు. అటువంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను’ అని పేర్కొన్నారు. ఇప్పటికే ఆమె తల్లి సానియా శర్మ స్పందించారు. తన కుమార్తె సెలబ్రిటీ అయినందువల్ల ఎవరితో మాట్లాడినా ఇటువంటి వదంతులు పుడుతూనే ఉంటాయని, వాటిని నమ్మవద్దని ఆమె అన్నారు.  
 

Updated Date - Mar 04 , 2025 | 06:10 PM