Kiara Adwani: మా జీవితానికి అద్భుతమైన బహుమతి 

ABN, Publish Date - Feb 28 , 2025 | 03:12 PM

బేబీ సాక్స్‌ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది’’ అని  ఇంస్టాగ్రామ్ వేదిక పోస్ట్ చేశారు.

హీరోయిన్  కియారా అడ్వాణీ (Kiara Advani), నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) దంపతులు  గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. బేబీ సాక్స్‌ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘మా జీవితానికి సంబంధించిన అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది’’ అని  ఇంస్టాగ్రామ్ వేదిక పోస్ట్ చేశారు. దీనికి  బేబీ ఎమోజీని జత చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ స్టార్‌ కపుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. రకుల్, కరీనా కపూర్, నేహా ధూపియా, ఏక్తా కపూర్ కియారా దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు. 

'షేర్షా’ (Shershaah) సినిమా కోసం తొలిసారి  వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే స్నేహం ఏర్పడింది. కొంతకాలానికే అది ప్రేమగా మారడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా వీరిద్దరూ సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నారు. కియారా అడ్వాణీ నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Updated Date - Feb 28 , 2025 | 03:13 PM