Emergency: కంగనా 'ఎమర్జెన్సీ'కి ఖలిస్తానీల ఝలక్..
ABN, Publish Date - Jan 20 , 2025 | 07:24 AM
Emergency: ఈ సినిమా స్పెషల్ ప్రాపగాండాతో తెరకెక్కించారని పలు చోట్ల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిక్కుల్లో వ్యతిరేఖత ఎక్కువగా ఉంది. ఇదంతా పక్కనా పెడితే.. తాజాగా 'ఎమర్జెన్సీ' సినిమా ప్రదర్శన మధ్య, ఖలిస్తానీ రాడికల్స్ బృందం లండన్‌లోని సినిమా హాల్‌లోకి చొరబడి..
కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎమర్జెన్సీ (Emergency)’. అనేక వివాదాల అనంతరం ఎట్టకేలకు జనవరి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా అనేక అవాంతరాలను ఎదురుకుంటుంది. ఇప్పటికే బాంగ్లాదేశ్ లో ఈ సినిమాని బ్యాన్ చేయగా, ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో గందరగోళం ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ఏర్పడిన చీకటి రోజులు ఎమర్జెన్సీ కాలాన్ని బేస్డ్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా స్పెషల్ ప్రాపగాండాతో తెరకెక్కించారని పలు చోట్ల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సిక్కుల్లో వ్యతిరేఖత ఎక్కువగా ఉంది. ఇదంతా పక్కనా పెడితే.. తాజాగా 'ఎమర్జెన్సీ' సినిమా ప్రదర్శన మధ్య, ఖలిస్తానీ రాడికల్స్ బృందం లండన్‌లోని సినిమా హాల్‌లోకి చొరబడి థియేటర్ లోపల గందరగోళం సృష్టిస్తూ సినిమా ప్రదర్శనను అడ్డుకుంది. నివేదిక ప్రకారం, ముసుగు ధరించిన రాడికల్స్ బృందం థియేటర్‌లో గందరగోళం కలిగించడం ద్వారా స్క్రీనింగ్‌కు అంతరాయం కలిగించింది. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఖలిస్తానీ అనుకూల తీవ్రవాదుల బృందం నినాదాలు చేస్తూ సినిమా ప్రదర్శనకు అంతరాయం కలిగించడం చూడవచ్చు.
సాక్షుల వెల్లడించిన వివరాల ప్రకారం.. రాడికల్స్ సున్నితమైన రాజకీయ సంఘటనలను ప్రస్తావించే ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించకుండా నిరోధించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. సినిమా స్క్రీనింగ్ సమయంలో రాడికల్స్ సినిమా హాల్‌లోకి ప్రవేశించి, ఒక గందరగోళం సృష్టించి, షోని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసినట్లు తెలియలేదు. పోలీసులు విచారం చేపట్టినట్లు తెలిపారు.
మరోవైపు స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించడానికి CCTV ఫుటేజీని సమీక్షిస్తోంది. స్క్రీనింగ్ సమయంలో సినిమా ప్రేక్షకుల భద్రత కోసం భద్రతా చర్యలను పటిష్టం చేస్తామని సినిమా వీక్షకులకు హామీ ఇచ్చింది. కంగనా ఈ సినిమాలో ఇందిరాగాంధీగా నటించగా అనుపమ్ ఖేర్ జయప్రకాశ్ నారాయణ్‌గా, శ్రేయాస్ తల్పడే వాజపేయి పాత్రల్లో నటించారు.