Kangana Ranaut: ఆ ట్రోఫీల కంటే అతనిచ్చిన బహుమతి గొప్పది...
ABN, Publish Date - Apr 05 , 2025 | 09:02 PM
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది.
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut0 స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) . ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. వసూళ్ల గురించి కాకుండా సినిమాకు ప్రశంసలు దక్కాయని కంగనా తరచూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తమ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఒక వ్యక్తి రాసిన లేఖను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎన్నో వివాదాలు ఎదుర్కొని ఎట్టకేలకు జనవరి 17న ఇది థియేటర్లలో విడుదలైంది.