Hrithik Roshan - Ntr: తారక్ తో డాన్స్.. హృతిక్ అంత మాట అన్నాడేంటి.. 

ABN, Publish Date - Apr 06 , 2025 | 02:45 PM

త్వరలో చేయనున్న ఆ పాట నాకు.. ఎన్టీఆర్‌కు మధ్య ఉండనుంది. దాని విషయంలో కొంచెం ఒత్తిడిగా ఉంది. ఎందుకంటే తారక్‌ గొప్ప నటుడు. ఆ పాటని నేను బాగా చేస్తానని ఆశిస్తున్నాను అని అంటున్నాడు హృతిక్ రోషన్.

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)టాలీవుడ్‌ స్టార్‌ తారక్‌ (Jr Ntr) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమైన కోస్టార్‌ ఎన్టీఆర్‌ అని అన్నారు. వీరిద్దరి కాంబోలో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హృతిక్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘‘ఈ చిత్రంలో భాగమైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఒక్క పాట మినహా చిత్రీకరణ  పూర్తయింది. త్వరలో చేయనున్న ఆ పాట నాకు.. ఎన్టీఆర్‌కు మధ్య ఉండనుంది. దాని విషయంలో కొంచెం ఒత్తిడిగా ఉంది. ఎందుకంటే తారక్‌ గొప్ప డాన్సర్. ఆ పాటని నేను బాగా చేస్తానని ఆశిస్తున్నా. ఈ ‘వార్‌ 2’ పార్ట్‌:1 కంటే  భారీగా మరింత అద్భుతంగా ఉండనుందని ప్రేక్షకులకు మాటిస్తున్నా. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని చూసేందుకు నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని హృతిక్‌ అన్నారు.  స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో హృతిక్‌ రా ఏజెంట్‌ మేజర్‌ కబీర్‌గా కనిపించనుండగా.. వీరేంద్ర రఘునాథ్‌ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో ఎన్టీఆర్‌ కనిపించనున్నట్లు బాలీవుడ్‌ చెబుతోంది. 

Updated Date - Apr 07 , 2025 | 03:08 PM