Fatima Sana Shaikh : అవకాశం కావాలంటే... అన్నీ చేయాలన్నాడు..

ABN, Publish Date - Jan 28 , 2025 | 02:13 PM

కెరీర్‌ ప్రారంభంలోనే క్యాస్టింగ్‌ కౌచ్ (Casting couch) ను ఎదుర్కొన్నట్లు ఫాతిమా చెప్పారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఓ నిర్మాత మాటలకు తాను ఇబ్బందిపడినట్లు తెలిపారు ఫాతిమా సనా షేక్‌.


బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ (Amir Khan) ‘దంగల్‌’ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టారు ఫాతిమా సనా షేక్‌Fatima Sana Shaikh. ఈ సినిమాలో ఆమె పాత్రకు చక్కని ఆదరణ దక్కింది. ఆ భామ తెలుగులోనూ అవకాశాలు అందుకుంది. ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ (Nuvvu Nenu okatavudam) అనే చిత్రంలోనూ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌ ప్రారంభంలోనే క్యాస్టింగ్‌ కౌచ్ (Casting couch) ను ఎదుర్కొన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఓ నిర్మాత మాటలకు తాను ఇబ్బందిపడినట్లు తెలిపారు.



‘‘ఇండస్ట్రీలో  కొత్త వారికి అవకాశం రావడం చాలా కష్టం. ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశం అందుకున్నా రిఫరెన్స్‌ పేరుతో నిర్మాతలే 15 శాతం పారితోషికాన్ని తీసుకుంటారు. బాలీవుడ్‌లోకి రావడానికి ముందు సౌత్‌  ఇండస్ట్రీలో  ఓ అవకాశం వచ్చింది. అది నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని అనుకున్నా. హైదరాబాద్‌లో ఆ చిత్ర నిర్మాతను కలిసినప్పుడు ఆయన నాతో అనుచితంగా ప్రవర్తించారు. ‘మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్థంగా ఉండాలి. ఏది చేయడానికేౖనా అంగీకరించాలి’ అన్నారు. సినిమాకు ఏం అవసరమైనా నేను చేయడానికి సిద్థంగా ఉన్నానని చెప్పాను. ఆ నిర్మాత క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. దాంతో ఇబ్బంది పడి మౌనంగా వచ్చేశాను. లైంగిక వేధింపుల కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయా. ఈ తరహా పరిస్థితులు చిత్ర పరిశ్రమలోనే కాదు అన్నిరంగాల్లోనూ ఉన్నాయని తర్వాత అర్ధం అయింది. ప్రతి స్త్రీ ప్రతిరోజూ వీటిని ఎదుర్కొంటుంది’’ అన్నారు. 

Updated Date - Jan 28 , 2025 | 02:24 PM