Bollywood: బాలీవుడ్‌లో దెయ్యాల ట్రెండ్

ABN, Publish Date - Jan 03 , 2025 | 09:48 PM

Bollywood: హాలీవుడ్ తరహాలో హార్రర్ సినిమాటిక్ యూనివర్స్ ను బాలీవుడ్ లో నిర్మించనున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.

Munjya Film poster

బాలీవుడ్ లో ప్రస్తుతం హర్రర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. మేకర్స్ వరుసగా హార్రర్ సినిమాలను ఆడియన్స్ మీదకు వదిలేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో స్త్రీ 2, ముంజ్యా , బ్లాక్, భూల్ భులయ్యా 3 సినిమాలు హార్రర్ కామెడీలుగా రూపొంది విజయవంతమయ్యాయి. వీటిలో మాడాక్ బ్యానర్ స్త్రీ 2 సినిమాను నిర్మించి వందలకోట్ల లాభాలను ఆర్జించింది.


మాడాక్ సంస్థ మరో ఎనిమిది హారర్ సినిమాలను లైనప్ చేసింది. నాలుగేళ్ల పాటు ఇవే సినిమాలను తీస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో కొన్నింటికి రిలీజ్ డేట్లను కూడా ప్రకటించటం విశేషం. ఇక ఈ హార్రర్ సిరీస్ లో మొదటగా వచ్చే సినిమాలో రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తుంది. మిగిలిన సినిమాల్లో అక్షయ్ కుమార్, అలియా భట్ వంటి అగ్ర తారలు నటించనున్నారు. హాలీవుడ్ తరహాలో హార్రర్ సినిమాటిక్ యూనివర్స్ ను బాలీవుడ్ లో కూడా మాడాక్ సంస్ద తమ సినిమాల ద్వారా క్రియేట్ చేయనుంది.

Updated Date - Jan 03 , 2025 | 09:51 PM