Ayesha takia: గూండాలు ఎవరో తెలుసుకుని మాట్లాడండి
ABN, Publish Date - Mar 06 , 2025 | 07:12 PM
నాగార్జున సరసన ‘సూపర్’ సినిమాలో జోడీగా నటించిన అయేషా టకియా భర్త ఫర్హాన్‌ను ఇటీవళ గోవా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన భర్త తప్పు ఏమీ లేదంటూ అయేషా వరుస పోస్టులు పెడుతున్నారు.
నాగార్జున సరసన ‘సూపర్’ (Super Heroine) సినిమాలో జోడీగా నటించిన అయేషా టకియా (Ayesha Takia) భర్త ఫర్హాన్‌ను (Farhan Azmi) ఇటీవళ గోవా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తన భర్త తప్పు ఏమీ లేదంటూ అయేషా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా గొడవకు సంబంధించిన పలు వీడియోలు షేర్ చేసింది.
‘‘బెదిరింపులకు పాల్పడిన వారిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. దయచేసి తప్పుడు ప్రచారాలు సృష్టించవద్దు. ఈ గొడవకు సంబంధించిన అన్ని వీడియోలు చూసి గూండాలు ఎవరో మీరూ ఒక అంచనాకు రండి. ఈ కేసులో నిజమైన బాధితులు నా భర్త, కుమారుడు. వారిని నిందించడం మానండి. ఈ గొడవ గురించి తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు నా భర్తను అదుపులోకి తీసుకున్న సమయంలో కొంతమంది మహిళలు తీవ్రమైన పదజాలంతో నా కుమారుడిని తిట్టారు. ఇంత అసహ్యంగా వ్యవహరించిన ఈ మహిళలు ఎవరు? వారి ప్రవర్తన సిగ్గుచేటు అంటూ గోవాలోని స్థానికుల తీరుపై ఆమె మండిపడ్డారు.
గోవాలోని కండోలిం మార్కెట్ వద్ద ఫర్హాన్‌కు, లోకల్ వాళ్లకు మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫర్హాన్‌తోపాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన అయేషా టకియా.. ‘‘ఇది మాకొక పీడ కల. నా భర్త, తనయుడిని అక్కడి వారు దారుణంగా అవమానించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. వారి నుంచి మా అబ్బాయిని కాపాడాలనే ఉద్దేశంతో నా భర్త పోలీసులకు సమాచారం అందించాడు. తీరా చూేస్త.. పోలీసులు నా భర్తనే అరెస్ట్ చేయడం బాధాకరం’’ అని అన్నారు.