Vijay Varma: మట్కా కింగ్ గా విజయ్ వర్మ

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:18 PM

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలు వెబ్ సీరిస్ లు అంటూ తెగ రచ్చ చేస్తున్నాడు. తాజాగా ఆయన చేస్తున్న వెబ్ సీరిస్ హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మ (Vijay Varma) ప్ర‌జెంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. రీసెంట్‌గా ఆయన తన లేటెస్ట్ వెబ్ సీరీస్ మట్కా కింగ్ (Matka King) షూటింగ్ వర్క్ ఫినిష్ చేసేశానని చెప్పుకొచ్చారు. ఓ కేక్, రెడ్ క్లాత్‌తో కూడిన కూల్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేశారు.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమ్ కానున్న ఈ సీరిస్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌ట్కా కింగ్‌కు డైరెక్టర్‌గా సైరత్ ఫేమ్ నాగరాజ్ మంజులే (Nagraj Manjule), నిర్మాతగా సిద్ధార్థ్ రాయ్ కపూర్ (Siddharth Roy Kapur)వర్క్ చేస్తున్నారు.  ముంబయిలో గ్యాంబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో, 1960ల కాలంలో సెట్ చేసిన కథ అని టాక్ వినిపిస్తోంది. ఇది వినగానే వరుణ్ తేజ్ (Varun Tej) న‌టించి మట్కా సినిమా స్టోరీ గుర్తొస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  మట్కా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు అదే స్టోరీని వెబ్ సీరీస్ రూపంలో తీసుకొస్తున్నారా అని కొందరు అనుకుంటుంటే, ఇంకొందరు మూవీ లవర్స్ “మట్కా స్టోరీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని కొత్తగా క్రియేట్ చేసి ఉంటారేమో” అని కామెంట్స్ చేస్తున్నారు.

మామూలుగా అయితే నాగరాజ్ మంజులే టాలెంటెడ్ డైరెక్టర్. ఎప్పుడూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చేందుకు ఫుల్ ట్రై చేస్తాడు. విజయ్ వర్మ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి... ఈ సీరీస్‌లో గుల్షన్ గ్రోవర్, కృతికా కమ్రా, సాయి తమ్హంకర్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.  మరి మట్కా కింగ్ ఎలా ఉంటుంది? ఓటీటీ ఆడియన్స్‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుందా అనేది చూడాలి.

Updated Date - Apr 25 , 2025 | 11:23 PM