Aamir Khan: వెండితెరపైకి అమీర్ 'మహాభారతం'

ABN, Publish Date - Apr 22 , 2025 | 01:08 PM

మహాభారతం ను సినిమాగా తెరకెక్కించాలన్నది తన కోరిక రాజమౌళి అనేక సార్లు చెప్పారు. ఆయన ఆలోచన కార్యరూపం దాల్చకముందే... ఇప్పుడు ఆమీర్ ఈ ప్రాజెక్ట్ ను వెయ్యి కోట్లతో చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇతిహాసాల పరంపర కొనసాగుతోంది. భాష‌తో సంబంధం లేకుండా అంద‌రూ ఆ క‌థ‌ల వెంటే ప‌డుతున్నారు. పురాణ పాత్రలకు కావాల్సినంత‌ ఎలివేష‌న్, డ్రామా, హీరోయిజం ఉండ‌టంతో వాటిపై సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రామాయ‌ణ‌, (Ramayana) మ‌హాభార‌తాలు (Mahabharatha) స్ఫూర్తితో సినిమాలు చేసేందుకు చాలా మంది మేక‌ర్స్, స్టార్ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ ఇతిహాసాలతో గతంలో చాలా సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఇప్పటి సినీ తారలు సైతం ఆ దిశగా అడుగులు వేస్తుండ‌టం ఆస‌క్తిరేపుతోంది.


రామాయణ, మహా భారతాలను ఎన్ని విధాలుగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipurush) వచ్చేసింది. అది బాక్సాఫీస్ బరిలో నిరాశ పర్చినా... మేకర్స్ మాత్రం తమ ప్రయత్నాలను విరమించుకోవడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం (Ramayanam) తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో నితిష్ తివారీ (Nitesh Tiwari ) ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు మ‌హాభార‌తాన్ని సినిమాగా తీయ‌డం కోసం ఇద్దరు లెజెండ్స్ కాచుకుని కూర్చున్నారు. ఒకరు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli ) కాగా, మరొకరు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan). మహాభారతం (Mahabharatham) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి చెప్పినా... ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. అయితే జక్కన్న కన్నా ముందు అమీర్ ఖాన్ రంగంలో దిగడం చర్చనీయాంశంగా మారింది.


మ‌హాభార‌తాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇటీవల ఆమీర్ ఖాన్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఉన్న అమీర్ ఓ ఇంటర్వ్యూలో మహాభారతం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. భారతీయ ఇతిహాసానికి ప్రాణం పోయాలనుకోవడంతో పాటు ఇప్పటి జనరేషన్ కు మహా భారతంను ఇవ్వడం తన డ్రీమ్ అనేశాడు. ఈ ఏడాది ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అయితే స్క్రీప్ట్ రాయడానికి టైం పడుతుందని.. పైగా అన్ని క్యారెక్టర్లను ఒకే సినిమాలో చూపించలేం కాబట్టి... సీరిస్ గా దీన్ని తెర‌పైకి తీసుకొస్తానని అన్నారు.


'మహాభారత్' ప్రాజెక్ట్ లో చాలా మంది దర్శకులు ఇన్వాల్ అయ్యే అవకాశం ఉందని, స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత రోల్స్ ను డిసైడ్ చేసుకుని... స్టార్ల ఎంపిక జరుగుతుందన్నారు. పైగా పార్ట్స్ పార్ట్స్ గా రానున్న ఈ ప్రాజెక్ట్ కు వేర్వేరు డైరెక్టర్లు షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మహాభారతం ను ఎంతో బాధ్యతతో పాటు భ‌యంతో మొదలు పెట్టాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. చిన్న త‌ప్పు కూడా దొర్లకుండా... ప్రతీ భార‌తీయుడు గర్వపడేలా భారీ స్టాయిలో తెరకెక్కించడంతో పాటు... భార‌తదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నట్లు ఆమీర్ తెలిపారు. మొత్తానికి మహాభారతం ఫ్రాంచైజీని ప్రొడ్యూస్ చేసేందుకు ఆమిర్ రెడీ అవ్వడం సెన్సేషన్ గా మారింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Also Read: Mohanlal: ఏప్రిల్ 25న తెలుగులోనూ తుడరుమ్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 22 , 2025 | 01:08 PM