Yearender 2024: 2024లో పునాది వేసుకున్న గ్రాండ్ ప్రాజెక్టులు.. 2025లో అసలైన ఆట

ABN, Publish Date - Dec 18 , 2024 | 08:51 PM

Rewind 2024: 2025లో పట్టాలెక్కనున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌కి 2024లోనే ముహూర్తం పడింది. ఇంతకీ ఆ క్రేజీ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఏంటంటే..

2024 టాలీవుడ్‌కి మిక్స్‌డ్ రిజల్ట్స్ ఇచ్చింది. కల్కి, పుష్ప 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ ని ఊచకోత కోయగా చిరంజీవి వంటి అగ్ర నటులు కొందరు అగ్రనటులు ఒక్కసారి కూడా స్క్రీన్ పై కనపడకపోవడం ఆడియెన్స్ ని నిరాశపరిచింది. మిస్టర్ బచ్చన్ వంటి డిజాస్టర్లను మరిచిపోయేందుకు ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు స్టార్ట్ కావడం అభిమానులకి సంబరంగా మారింది.


బాలయ్య-బోయపాటి

'సింహ’తో గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌ మొదలైంది. బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలతో పాటు బలమైన కథ, పాత్ర, డైలాగ్‌లతో సినిమా తీసి విజయం సాధించారు. బాలయ్యను పాత్రకు తగ్గట్టు ఎలా మౌల్డ్‌ చేయాలో కూడా బోయపాటికి బాగా తెలుసు. వాళ్లిద్దరికీ అలా సింక్‌ అయింది. ఆ తర్వాత వారిద్దరి కలయికలో వచ్చిన ‘లెజెండ్‌’, ‘అఖండ’ చిత్రాలు సైతం భారీ విజయం సొంతం చేసుకున్నారు. హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పుడు డబుల్‌ హ్యాట్రిక్‌ కోసం ‘అఖండ 2’కి 2024లో శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్ తెగ వైరల్ గా మారింది. ఈ సినిమాని సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు.


బన్నీ-త్రివిక్రమ్

అల్లు అర్జున్‌కు పుష్ప 2 హడావిడి అయిపోయింది. నెక్ట్స్‌ బన్నీ కమిట్‌మెంట్‌ ప్రకారం నెక్ట్స్‌ సినిమా త్రివిక్రమ్‌తో ఉంది. అయితే ఈ చిత్రం ప్రారంభం జూన్‌ 2025లో ఉంటుంది అని అంతా అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ జనవరిలో ఉంటుందని టాక్‌ నడుస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఓ మాంచి వీడియో కట్‌తో ఎప్పుడైనా ఈ సినిమా ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. మూడేళ్లగా ఆయన ఇదే సినిమాతో బిజీగా ఉండటం వల్ల కాస్త విరామం తీసుకోవాలనుకుంటున్నారట. కొంత విశ్రాంతి తర్వాత నెక్ట్స్‌ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడతారని తెలుస్తోంది. జానర్‌ ఏంటనేది తెలీదు కానీ.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ కథ కథ, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో జులాయి’ సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు తీసి హ్యాట్రిక్‌ కొట్టారు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి సన్నదమవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది.


చెర్రీ-సుకుమార్

అగ్ర దర్శకుడు సుకుమార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ ఇద్దరూ ఇంతకు ముందు 'రంగస్థలం' అనే ఒక అతి పెద్ద విజయవంతమైన సినిమా చేశారు. 'రంగస్థలం' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇద్దరి స్టామినా ఏంటో ఇంతకు ముందే నిరూపించింది. అలంటి ఈ ఇద్దరూ మళ్ళీ కలుస్తున్నారు, దీనికి ప్రస్తుతం రామ్ చరణ్ 17వ (RC17) సినిమాగా పిలుచుకుంటున్నారు. ఎప్పుడెప్పుడా ఈ ఇద్దరి కాంబినేషన్ అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. 'రంగస్థలం' నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ సినిమా కథని 'రంగస్థలం' కంటే ఎన్నో రేట్లు రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే విధంగా రూపుదిద్దినట్టుగా తెలుస్తోంది. 'రంగస్థలం' రామ్ చరణ్ కెరీర్ లో నటుడిగా, కలెక్షన్స్ పరంగా ఎంతో ముఖ్యమైన సినిమా. అటువంటి సినిమా కన్నా ఇంకా పెద్ద స్కేల్ లో ఈ ఆర్సీ17 ఉండబోతోందని చెపుతున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 08:53 PM