BiggBossTelugu8: బిగ్‌బాస్ హౌజ్‌లో గంగవ్వకు గుండెపోటు.. న్యూస్ వైరల్
ABN, Publish Date - Oct 22 , 2024 | 06:16 PM
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్8 లో యువ కంటెస్టెంట్లకు పొటీగా దూసుకుపోతున్న యూట్యబూర్ గంగవ్వ కు అనారోగ్య సమస్యలు ఎదురై ఆస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్8 (#BiggBossTelugu8)లో యువ కంటెస్టెంట్లకు పొటీగా టాప్ యూట్యబూర్ గంగవ్వ (Gangavva) దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టైటిల్ హాట్ ఫేవరేట్‌గా ఉన్న ఆమె తన మార్క్‌తో తోటి కంటెస్టెంట్స్‌తో నడుచుకుంటూ గేమ్‌ను కొనసాగిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గంగవ్వకు అనారోగ్య సమస్యలు ఎదురై ఆస్పత్రికి తరలించినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. తొలిసారి బిగ్ బాస్ సీజన్ 4లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించిన గంగవ్వ(Gangavva) అప్పుడు హౌజ్‌లో ఎయిర్ కండిషనింగ్, లోన్లీనెస్ ఇతర కారణాలతో ఎక్కువ రోజులు ఇమడలేక మధ్యలోనే బయటకు వచ్చేసింది. మరలా ఇప్పుడు సీజన్8 (#BiggBossTelugu8)లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను సర్‌ప్రైజ్ చేసింది. వచ్చిన తొలిరోజే అవినాష్ తో కలిసి గేమ్ ఆడి మెప్పించింది కూడా. అయితే గంగవ్వ హౌజ్‌లోకి వచ్చి వారం దాటిన తర్వాత ఇప్పుడు ఆమెకు సడన్‌గా గుండెపోటు వచ్చిందన్న వార్త సామాజిక మాధ్యమాల్లో ఈ రోజు బాగా వైరల్ అవుతోంది.
అయితే గంగవ్వ(Gangavva)కు గుండెపోటు రావడంతో ఇతర కంటెస్టెంట్స్ తీవ్ర ఆందోళకు గురయ్యారని, విష్ణుప్రియ చాలా టెన్షన్ పడినట్లు కొందరు బిగ్ బాస్ రివ్యూవర్స్ చెప్పడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు గంగవ్వకు వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్యుల బృందం బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తుండడతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా ఫ్రాంక్ అని కొందరు చెబుతుండగా.. బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా గంగవ్వ హార్ట్ అటాక్ వచ్చినట్లు తోటి కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చిందంటూ కూడా అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇదిలాఉండగా బిగ్‌బాస్ #BiggBossTelugu8 టీఆర్పీ పెంచేందుకు సదరు యాజమాన్యమే కావాలని ఇలాంటి వార్తలు ఏమైనా పుట్టిస్తుందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగవ్వ (Gangavva)కు గుండెపోటు వచ్చిందనే అంశంపై పలు మీడియా సంస్థలు గంగవ్వతో తరుచూ వీడియోలు, షార్ట్‌ఫిల్ములు రూపొందించే మై విలేజ్ షో సభ్యలును ఎంక్వైరీ చేయగా గంగవ్వకు గుండెపోటు లాంటి సమస్యలు ఏమీ లేవని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని, బిగ్‌బాస్ నిర్వాహకులకు ఫోన్ చేసినట్లు వారి నుంచి అలాంంటి సమాచారం ఏమీ రాలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం.