Yash: వివాదంలో యష్ ‘టాక్సిక్’.. అటవీ శాఖా మంత్రి ఫైర్

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:53 PM

కర్ణాటకలో బిగ్గెస్ట్‌ హీరో యష్‌. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాల తర్వాత ఆయన ఏం సినిమా చేస్తున్నారనేది కొన్నాళ్ల పాటు సస్పెన్స్‌గా ఉండగా.. ఇటీవలే ఆయన తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ అని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడీ చిత్రం కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఏకంగా కర్ణాటక మినిస్టర్ కలగజేసుకోవడంతో.. ఈ సినిమా అసలు ఉంటుందా? అనేలా అనుమానాలు మొదలయ్యాయి. అసలు విషయం ఏమిటంటే..

Toxic Movie Shooting Lands and Yash

కర్ణాటకలో బిగ్గెస్ట్‌ హీరో యష్‌ (Yash). ‘కెజియఫ్’ (KGF) సిరీస్ చిత్రాల తర్వాత ఆయన ఏం సినిమా చేస్తున్నారనేది కొన్నాళ్ల పాటు సస్పెన్స్‌గా ఉండగా.. రీసెంట్‌గా తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’ (Toxic) అని యష్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి, కరీనాకపూర్‌, శ్రుతిహాసన్‌, కియారా అడ్వాణీ పేర్లు పరిళీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు హీరోయిన్‌గా నటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం భారీ సెట్లు వేశారు. అది కూడా ఫారెస్ట్‌ భూమిలో. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. యష్‌ నటిస్తున్న ఈ ‘టాక్సిక్‌’ మూవీ చిత్రం కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని HMT ల్యాండ్స్‌లో ప్రారంభమైంది. ఇక్కడ భారీ సెట్‌ను వేశారు మేకర్స్‌. అయితే ఈ సినిమా షూటింగ్‌ కోసం ఆ భూమిలో చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాధికారులు అక్కడ దిగారు.

Also Read- Kiran Abbavaram: మిమ్మల్ని ఏ రోజైనా ఏమైనా అడిగానా.. ఆ సినిమాలో నన్ను ఎందుకు ట్రోల్ చేశారు


గతంలో శాటిలైట్‌ చిత్రాలను.. ఇప్పుడున్న పరిస్థితిని సమీక్షించారు. చెట్లు నరికేసినట్లు నిర్థారించుకున్నారు అధికారులు. అదే సమయంలో అటవీ శాఖా మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే (Karnataka Minister Eshwar Khandre).. యష్‌ ‘టాక్సిక్‌’ మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. చెట్లు నరికివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీణ్య సమీపంలో ఉన్న ఈ హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగింది. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారన్నారు మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరమన్నారు.


Karnataka-minister.jpg

ఈ నేప‌థ్యంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఆ అడవిలో ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 599 ఎకరాల భూమిని ఇదివరకే రిజర్వ్‌ ఫారెస్టుగా ప్రకటించినట్లు అధికారులు చెబుతున్నారు. దానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. అయితే HMT సంస్థ ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమంగా వివిధ సంస్థలు, ప్రైవేటు గ్రూపులకు, వ్యక్తులకు భూమిని అమ్మేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మిగిలి ఉన్న భూమిని షూటింగ్స్‌కు ఇస్తూ ధనార్జన చేపడుతున్నారని విమర్శలు మొదలయ్యాయి. చూస్తుంటే ఈ వివాదం చాలా పెద్దది అయ్యేలానే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

Also Read- NTR: కొత్త NTR వచ్చేశాడు.. జూ. ఎన్టీయార్ ఏమన్నాడంటే

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 30 , 2024 | 07:06 PM