Hanuman: ‘హనుమాన్’.. సినిమా చూస్తుండగా మహిళకు పూనకాలు! నిజమేనా?
ABN, Publish Date - Jan 30 , 2024 | 06:04 PM
హనుమాన్ సినిమా థియేటరల్లోకి వచ్చి 20 రోజులు పూర్తయిన దాని హంగామా ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఓ మహిళ సినిమా చూస్తున్న క్రమంలో పూనకాలు ఆవహించినట్టుగా ప్రవర్తించింది.
హనుమాన్ (Hanuman) సినిమా థియేటరల్లోకి వచ్చి 20 రోజులు పూర్తయిన దాని హంగామా ఏ మాత్రం తగ్గట్లేదు. వీకెండ్స్ వస్తే హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దుమ్ము రేగ్గోడుతూ సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా టికెట్లు అమ్ముడు పోయినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ ఇది తెలుగు సినిమా చరిత్రలో ఓ అరుదైన సంఘటనగా పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఓవర్సీస్లో 6మిలియన్స్ వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించడమే కాక స్టిల్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో స్టడీగా రన్ అవుతోంది.
అయితే హనుమాన్ (Hanuman) సినిమా ఓ వైపు ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పోతుండగా మరోవైపు ప్రేక్షకులు చిత్రాన్ని చూసి మైమరిచి పోతున్నారు. పూర్తిగా భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. తాజాగా ఉప్పల్‌లోని ఓ థియేటర్లో ఓ మహిళ కుటుంబంతో వచ్చి సినిమా చూస్తున్న క్రమంలో క్లైమాక్స్‌లో హనుమంతుడు వచ్చే సన్నివేశాలు చూస్తుండగా పూనకాలు ఆవహించినట్టుగా ప్రవర్తించింది.
దీంతో అక్కడే ఉన్న ప్రేక్షకులు తమ మోబైల్స్‌లో ఈ దృశ్యాలను రికార్డు చేశారు. అంతేగాక మహిళకు దేవుడు ఆవహించడంతో శివాలు ఊగిందంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. అసలు నిజం ఏంటంటే సినిమా చూస్తున్న సమయంలో మహిళకు ఫిట్స్ వచ్చాయని తర్వాత వైద్యులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా ఈ హనుమాన్ (Hanuman) చిత్రం చేస్తున్న ఈ సంచలనాలు ఇంతటితో ఆగలేదు. ముఖ్యంగా పిల్లలను ఈ సినిమా బాగా ఓన్ చేసుకున్నారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ సినిమాను చూస్తు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటికి వెళ్లాక సినిమాలోని శ్లోకాలను, సన్నివేశాలను అనుకరిస్తు ఆంజనేయుడిపై తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈవీడియోలు సామాజిక మాధ్యమాల్లో కొకోల్లలుగా ఉన్నాయంటే సినిమా వారిపై ఎంత ప్రభావం చూపించిందో ఇట్టే అర్థమవుతుంది.