Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

ABN, Publish Date - Oct 10 , 2024 | 09:54 AM

బిగ‌బాస్ తెలుగు సీజ‌న్ 8 రోజుకో మ‌లుపు తిరుగుతూ ఉంది. రోజుకో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంది. తాజాగా విష్ణుప్రియ సిగ‌రెట్ తాగుతూ కనిపించడం పెద్ద‌ హాట్‌టాపిక్ అయింది.

vishnu priya

బిగ‌బాస్ తెలుగు సీజ‌న్ 8 (Bigg Boss 8 Telugu) అనుకున్న విధంగానే రోజుకో మ‌లుపు తిరుగుతూ ఉంది. సెప్టెంబర్ 1న మొద‌లైన ఈ రియాలిటీ షోకు వ‌చ్చిన‌ 14 మందిలో ఆరుగురు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఆపై అంత‌కుముందు సీజ‌న్‌ల‌లో పాల్గొన్న వారు 8 మంది కొత్త‌గా వైల్డ్ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇవ్వ‌డంతో హౌజ్ ఇప్పుడు కంటెస్టెంట్స్‌తో క‌ల‌క‌ల‌లాడుతుంది. వాళ్లు రాగానే ఎలిమినేష‌న్ జ‌ర‌గ‌డం రెండు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకోవ‌డం కూడా జ‌రిగిపోయి మ‌ళ్లీ అంతా నార్మ‌ల్ గేమ్‌కు వ‌చ్చారు.

అయితే ముఖ్యంగా ఈ స‌మ‌యంలోనే హౌజ్‌లోని మెంబ‌ర్స్ న‌డ‌వ‌డిక‌ను బిగ్‌బాస్‌ యావ‌త్ రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు ఉంచుతోంది. ఇక కంటెస్టెంట్స్ త‌మ ఓపిక‌ను,అల‌వాట్ల‌ను కంట్రోల్ చేసుకోలేక‌ త‌మ‌ వాస్త‌వ‌ ప్ర‌వర్త‌న‌తో అడ్డంగా బుక్ అవుతున్నారు. రెండు వారాల క్రితం ఇద్ద‌రు మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మ‌ధ్య ఏదో జ‌రుగుతుందంటూ సోష‌ల్‌ మీడియాలో ర‌చ్చ కాగా తాజాగా విష్ణుప్రియ ఆ లిస్టులో చేరింది. ప్ర‌స్తుతం ఈ సీజ‌న్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌, ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉన్న యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) పొగ తాగుతూ కెమెరాల‌కు చిక్కింది.

ఇటీవ‌ల హౌజ్‌లోకి వ‌చ్చిన అనంత‌రం ఓ ఎపిసోడ్‌లో నిఖిల్ మ‌ణికంఠ‌ను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్ ప‌డేస్తున్న స‌మ‌యంలో బ్యాగ్రౌండ్‌లో ఉన్న స్మోకింగ్ జోన్‌లో విష్ణుప్రియ సిగ‌రెట్ తాగుతూ కనిపించింది. అయితే, అక్క‌డున్న‌ది సీత అని కొందరు డౌట్ పడినప్ప‌టికీ ఆరోజు ఎపిసోడ్‌లో విష్ణుప్రియ ధ‌రించిన‌ బ్లాక్ అండ్ వైట్ బుల్లి గౌను బ‌ట్టి అక్క‌డున్న‌ది విష్ణు ప్రియ‌నే అని నిర్ధార‌ణ చేస్తున్నారు.


అయితే విష‌యాన్ని కొంత‌మంది న‌మ్మ‌డం, మ‌రికొంత‌మంది న‌మ్మ‌లేక పోవ‌డంతో హౌజ్‌లో స్మోకింగ్ చేసేవారి గురించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. హౌజ్‌మేట్ల‌లో పురు చెప్ప‌కుండా ఓ లేడీ ద‌మ్ముకొడుతుంద‌ని దానిని టెలికాస్ట్ చేయ‌డం లేదంటూ ఇటీవ‌ల ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల చెప్పిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌజ్‌లో అడిగిన వారికి బీర్ ఇస్తారట కదా అని ఆర్జే శేఖర్ బాషాను అడగగా అలాంటి అవ‌కాశ‌మే లేదు.. కానీ, పృథ్వీ, నిఖిల్‌, విష్ణుప్రియ దమ్ము కొడుతుంటారు అని శేఖర్ బాషా చెప్పి అయ్యో చెప్పేసానా అంటూ నాలుక సైతం క‌ర్చుకున్న సంగ‌తి విధిత‌మే. ఈ వీడియో ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతుంది.

ఇదిలాఉండ‌గా.. విష్ణు ప్రియ స్మోకింగ్ విషయం బ‌య‌ట ప‌డ‌డంతో సోష‌ల్ మీడియా రంగంలోకి దిగి ఆ క్లిప్‌ను షేర్ చేస్తూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విష‌యం అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంలో కొంద‌రు తాగితే త‌ప్పేంటి అని కొంద‌రు విష్ణు ప్రియ‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా మ‌రికొంత‌మంది ఘూటుగా విమ‌ర్శిస్తున్నారు. ఆడైనా, బమ‌గైనా సిగ‌రెట్ జోలికి పోవ‌ద్దంటూ హిత‌వు ప‌లుకుతూ కిమెంట్లు చేస్తున్నారు. గ‌తంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న ముమైత్ ఖాన్ ,హమిదా, తేజస్విని మదివాడ, సరయు వంటి కొద్దిమంది ఫిమేల్ కంటెస్టెంట్స్‌ స్మోకింగ్ చేసిన‌ప్ప‌టికీ టెలికాస్ట్ అయ్యే వీడియోలో ఎప్పుడు రాలేదు. దాంతో ఈ విష‌యం చాలామందికి తెలియ‌దు. చూడాలి మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్ని చూడాల్సి వ‌స్తుందో.

Updated Date - Oct 10 , 2024 | 09:54 AM